Thursday, February 08, 2007

శ్రీ నందమూరి ప్రసంగం by శ్రీ క్రిష్ణదేవరాయలు

తెలుగు రక్తాని ఉడికించి, తెలుగు తేజాన్ని మనందరిలో నింపి, భారతదేశంలోనే తెలుగు జాతికి, తెలుగు వాడికి ఒక గుర్తింపును తెచ్చి పెట్టిన మహా మనిషి మన అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు. వారి ఆ మహా ప్రసంగాన్ని ఈ ఆధునిక ప్రపంచం మరువకుండా ఈ వెబ్ ప్రపంచంలో సాశ్వతంగా వుంచేసారు ఈనాటి శ్రీ క్రిష్ణదేవరాయలు వారు (Dr ఇస్మాయిల్ గారు). ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించి ఆ ప్రసంగాన్ని చదవండి, చదివించండి.

Dr ఇస్మాయిల్ గారి బ్లాగులో ఇంకా ఎన్ని నిగూడమైన ఆణిముత్యాలున్నయో!! నా సంగ్రహాలయం వీటితో కలకలలాడి పోతోందొచ్.
శ్రీ నందమూరి ప్రసంగం-మొదటి భాగము
శ్రీ నందమూరి ప్రసంగం- రెండవ భాగము


కొన్ని మచ్చు తునకలు ...

---సుదూర సాగర తీరాల దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతీ దీపికలు వెలిగించి మాతృభూమికి ఖ్యాతి ఆర్జించుతున్న నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు ఆరుకోట్ల తెలుగు ప్రజల పక్షాన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన, నా పక్షాన యివే నా శుభాకాంక్షలు, శుభాభినందనలు, నమస్సుమాంజలులు.

----'తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగువల్లభుండ, తెలుగొకండ, ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స' అని శ్రీకృష్ణదేవరాయలతో సెలవిచ్చాడు సాక్షాత్తూ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఏనాడో. ఆ రసమయ స్వాప్నిక ప్రసాదంగా అవతరించింది అపూర్వ రసబంధుర మహాంధ్రకావ్యం అముక్తమాల్యద.

----సంప్రదాయానికి, ఆధునికతకు మేలి కలయికగా, సుసంపన్నమైన సాంస్కృతిక విలువలకు, అభ్యుదయకరమైన దృక్పథాలకు చక్కని సమ్మేళనంగా అవతరిస్తోంది నేడు ఆంధ్రప్రదేశ్.

----అరుగో! పసుపు కుంకుమలతో పచ్చగా నిండుగా వున్న మన ఆడపడుచులు సుమధుర మందహాసాలతో, మంగళారతులతో స్వాగతం చెబుతున్నారు

ఇదే ఇదే నేను ఆకాంక్షించే తెలుగుసీమ

ఇదే నేను మీనుండి కోరే సహకారం

ఇదే నా వాంఛితం

ఇదే ఇదే ఇదే నా ధ్యేయం.

లోకసమస్తా సుఖినోభవంతు!

జై తెలుగునాడు - జై హింద్!

- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీ.శే. శ్రీ ఎన్.టి.రామారావు. మే, 1984.-