Saturday, February 17, 2007

పుణ్య శివ క్షేత్రము 'అలంపూర్'


స్కంద మరియు ఇతర మహా పురణాలలో "అలంపూర్" ను "దక్షిణ కాశి" గా వర్ణించి ఉండడము విశేషము. కాశీ కి అలంపూర్ కు చాలా దగ్గరి పోలికలు ఉన్నందువలనే ఈ పేరు. కాశి లో గంగానది, విశ్వేశ్వరుడు - విశాలాక్షీ, 64 ఘట్టములున్నవి. సమీపమున త్రివేణి సంగమమున్నది. అలంపురము ఉత్తర వాహిని తుంగభద్రాతీరమున్నది. బ్రహ్మేశ్వరుడు - జోగులాంబా, పాపనాశిని, మణికర్నిక మొదలగు 64 ఘట్టములున్నవి. సమీపమున కృష్ణా తుంగభద్రా సంగమమున్నది.

బ్రహ్మ దేవుడు ప్రతిష్టించినందున బ్రహ్మేశ్వరుడని పేరు వచ్చినది. ఇందలి బ్రహ్మేశ్వర లింగమును జ్యోతిర్లింగము అనెదరు."రససిద్ధుడు" ఈ ఆలయమును కట్టించెను.

ఇందలి నవ బ్రహ్మాలయములో ఉన్నవి అన్నీ శివలింగములే - బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, ఆర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ, పద్మబ్రహ్మ. ఈ ఆలయమును "శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి" అందురు. అస్టాదశ శక్తి పీఠాలలో 5 వ శక్తి పీఠము ఇది. జమదగ్ని ఆశ్రమము ఇక్కడే ఉండెనని ప్రసిద్ది. ఇంతటి చరిత్ర కల్గిన పుణ్య శివ క్షేత్రము "అలంపూర్".
మౌర్య, బాదామి చాళుక్య, రాష్ట్రకూట, కళ్యాణీ చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్షాహీ, ఆసఫ్జాహీ పాలనలను అలంపూర్ చూసింది.
మరికొన్ని లంకెలు

No comments: