Sunday, February 18, 2007
మా తెలుగు తల్లికి మల్లె పూదండ..రూపాంతరము
రియాద్ తెలుగు కళాక్షేత్రం వార్షికోత్సవాలు (18 మే, 2006) నందు ఈ పాటకు రూపాంతరము చేయడాని ఒక చిన్న ప్రయత్నము చేసాము.
మీరందరూ తప్పక చూసి, విని, ఆనందించ గలరని ఆశిస్తూ....
--గౌరి శంకర్
మా తెలుగు తల్లికి మల్లె పూదండ download pps
మా తెలుగు తల్లికి మల్లె పూదండ flash show
Saturday, February 17, 2007
పుణ్య శివ క్షేత్రము 'అలంపూర్'
బ్రహ్మ దేవుడు ప్రతిష్టించినందున బ్రహ్మేశ్వరుడని పేరు వచ్చినది. ఇందలి బ్రహ్మేశ్వర లింగమును జ్యోతిర్లింగము అనెదరు."రససిద్ధుడు" ఈ ఆలయమును కట్టించెను.
Thursday, February 08, 2007
శ్రీ నందమూరి ప్రసంగం by శ్రీ క్రిష్ణదేవరాయలు
Dr ఇస్మాయిల్ గారి బ్లాగులో ఇంకా ఎన్ని నిగూడమైన ఆణిముత్యాలున్నయో!! నా సంగ్రహాలయం వీటితో కలకలలాడి పోతోందొచ్.
శ్రీ నందమూరి ప్రసంగం-మొదటి భాగము
శ్రీ నందమూరి ప్రసంగం- రెండవ భాగము
కొన్ని మచ్చు తునకలు ...
---సుదూర సాగర తీరాల దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతీ దీపికలు వెలిగించి మాతృభూమికి ఖ్యాతి ఆర్జించుతున్న నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు ఆరుకోట్ల తెలుగు ప్రజల పక్షాన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన, నా పక్షాన యివే నా శుభాకాంక్షలు, శుభాభినందనలు, నమస్సుమాంజలులు.
----'తెలుగుదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగువల్లభుండ, తెలుగొకండ, ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స' అని శ్రీకృష్ణదేవరాయలతో సెలవిచ్చాడు సాక్షాత్తూ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఏనాడో. ఆ రసమయ స్వాప్నిక ప్రసాదంగా అవతరించింది అపూర్వ రసబంధుర మహాంధ్రకావ్యం అముక్తమాల్యద.
----సంప్రదాయానికి, ఆధునికతకు మేలి కలయికగా, సుసంపన్నమైన సాంస్కృతిక విలువలకు, అభ్యుదయకరమైన దృక్పథాలకు చక్కని సమ్మేళనంగా అవతరిస్తోంది నేడు ఆంధ్రప్రదేశ్.
----అరుగో! పసుపు కుంకుమలతో పచ్చగా నిండుగా వున్న మన ఆడపడుచులు సుమధుర మందహాసాలతో, మంగళారతులతో స్వాగతం చెబుతున్నారు
ఇదే ఇదే నేను ఆకాంక్షించే తెలుగుసీమ
ఇదే నేను మీనుండి కోరే సహకారం
ఇదే నా వాంఛితం
ఇదే ఇదే ఇదే నా ధ్యేయం.
లోకసమస్తా సుఖినోభవంతు!
జై తెలుగునాడు - జై హింద్!
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీ.శే. శ్రీ ఎన్.టి.రామారావు. మే, 1984.-