Sunday, January 21, 2007

'కర్నూలు వైద్య కళాశాల' స్వర్ణోత్సవాలు


'కర్నూలు వైద్య కళాశాల స్వర్ణోత్సవాలు'- శ్రీ క్రిష్ణదేవరాయలు

మా 'కర్నూలు వైద్య కళాశాల' స్వర్ణోత్సవాలు జరుగుతున్న ఈ శుభ సందర్భంలో మీతో ఆ సంతోషాన్ని పంచుకొనేందుకు శ్రీ క్రిష్ణదేవరాయలు @ Dr Ismail గారు రాసిన వ్యాసము నుంచి కొన్ని మచ్చు తునకలు -
" ఇప్పుడు కర్నూలుగా పిలువబడే ఈ నగరం పూర్వ నామధేయం 'కందెనవోలు'. 11వ శతాబ్దిలో 'ఆలంపూరు' లో ఆలయం కట్టడానికి బళ్ల మీద రాళ్లను తరలించే క్రమంలో ఈ ప్రాంతంలో బండి చక్రాలకు 'కందెన' రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి 'కందెనవోలు' అనే పేరు వచ్చింది. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందింది."
"1565లో తళ్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు"
"తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఇప్పటి రాయలసీమ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు, ఇప్పటికీ సినీపరిభాషలో 'సీమ'ను సీడెడ్ అనే పిలుస్తారు."
"1953లో మద్రాసు రాష్ట్రంలోని ఉత్తర 11 జిల్లాలన్నీ కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినప్పుడు 'కర్నూలు' కొత్త రాష్ట్రానికి తొలి రాజధాని అయ్యింది."

1 comment:

Dr.Pen said...

మీ బ్లాగులో లంకె వేసినందుకు కృతజ్ఞతలు!