Wednesday, November 22, 2006

వాడు - వీడు వాడకము

మనుషుల మధ్య ఉన్న అంతరాలు దేవుడికి వర్తించవు. ఆయన మనందరికీ తండ్రి కనుక."డు" ప్రత్యయం ఎప్పుడూ అవమాన సూచకం కాదు. అసలది మొదలయిందే గౌరవసూచకంగా ! ఎలా అంటే -మొదట్లో, అంటే 2000 సంవత్సరాల క్రితం, తెలుగువారు కూడా తమిళుల్లాగా రామన్, కృష్ణన్ అనేవారు. తరువాత అది సమంజసంగా అనిపించక గౌరవ సూచకంగా ఒక "రు" చివరిలో చేర్చి రామన్ఱు కృష్ణన్ఱు అనడం మొదలుపెట్టారు. అవే తరువాత రామండు కృష్ణండు అయి ఇంకా తరువాతి కాలంలో రాముండు కృష్ణుండు అయ్యాయి.

ఇంకో విషయం. వాడు వీడు అనేవి కూడా మొదట్లో అవమాన సూచకాలు కావు. అవి ఈనాటి "ఆయన, ఈయన" తో సమానం.కాలక్రమంలో వాడగా వాడగా చేదయ్యాయి. మాలల్ని మొదట హరిజనులని తరువాత అది కూడా వెగటుపుట్టి ఇప్పుడు దళితులంటున్నట్లు.అలాగే "అది, ఇది" అని స్త్రీలని ఈరోజు సంబోధిస్తే చాలా గొడవలవుతాయి. కాని మొదట్లో స్త్రీలింగానికి సర్వనామాలు అవే.వాటిని దేవతలకీ పతివ్రతలకీ కూడా అన్వయించి ప్రయోగించి ఉండడం మనం పాత తెలుగు కావ్యాల్లో గమనించవచ్చు.

ఇప్పుడు వాడుకలో ఉన్న ఆమె ఈమె అనేవి 19వ శతాబ్దానికి ముందు వాడుకలో లేవు. ఇవి నిజానికి సంధి రూపాలు. ఆ యమ్మ ఆమె అయింది.ఈ యమ్మ ఈమె అయింది.అలాగే ఆ బిడ్డ ఆవిడ అయింది. ఈ బిడ్డ ఈవిడ అయింది. అలాగే ఆ యన్న ఆయన అయ్యాడు. ఈ యన్న ఈయన అయ్యాడు.

ఈ ఆధునిక సర్వనామాలకి బహువచన రూపాలు (ఆమెలు, ఈమెలు, ఆవిడలు, ఈవిడలు, ఆయనలు, ఈయనలు మొదలైనవి)లేకపోవడమే ఇవి ఇటీవలి సృష్టి అని సూచిస్తోంది.
----------------------------------------------------
రచయిత: తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
http://www.telugusaahityam.blogspot.com

Saturday, October 14, 2006

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు

అమరావతీనగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగుతల్లీ, జై తెలుగు తల్లీ!

Monday, October 09, 2006

హంపి

హంపి శిధిల సౌధాలు... మౌన సాక్ష్యాలు
http://eenadu.net/htm/weekpanel1.asp

Sunday, September 17, 2006

స్వామి వివేకానంద వచనాలు # 2 (నా అనువాదముతో)

#6 You cannot believe in God until you believe in yourself.
భగవంతున్ని నీవు నమ్మవు, నిన్ను నీవు నమ్మనంతవరకు.

bhagavantunni nIvu nammavu, ninnu nIvu nammanantavaraku

#7 Where can we go to find God if we cannot see Him in our own hearts and in every living being.
భగవంతుడిని ఎక్కడ కనుగొనగలం,మన మనసుల్లోను మరియు ఏ జీవములోను మనకు కనిపీయనప్పుడు?

bhagavantuDini ekkaDa kanugonagalam,mana manasullOnu mariyu E jIvamulOnu manaku kanipeeyanappuDu?

#8 We are what our thoughts have made us; so take care about what you think. Words are secondary. Thoughts live; they travel far.
ఆలోచనలు జీవిస్తాయి, పయనిస్తాయి; మన ఆలోచనలే మన రూపు దిద్దుతాయి; అందుకే ఆలోచించే విషయాల గురించి జాగ్రత్త తీసుకో!

aalOcanalu jeevistAyi, payanistAyi; mana aalOchanalE mana roopu diddutaayi; andukE aalOcinchE vishayaala gurinchi jaagratta teesukO!

#9 The more we come out and do good to others, the more our hearts will be purified, and God will be in them.
మనము ఇతరులకు ఎంత మంచి చేస్తామో,మన మనస్సులు అంత పవిత్రమవుతాయి; అప్పుడు భగవంతుడు వాటిలో ఉంటాడు.

manamu itarulaku enta manchi cEstaamO,mana manassulu anta pavitramavutaayi; appuDu bhagavantuDu vaaTilO unTADu.

#10 GOD of truth, be Thou alone my guide…
సత్యమే భగవంతుడు, అదే నా ఒక్కగానొక్క మార్గదర్సి...

satyamE bhagavantuDu, adE naa okkagaanokka maargadarsi...

--- మరిన్ని త్వరలో
అనువాదము: గౌరి శంకర్ సాంబటూర్ Sep 17, 2006

స్వామి వివేకానంద వచనాలు # 1 (నా అనువాదముతో)

# 1 Where God is, there is no other. Where world is, there is no God. These two will never unite. Like light and darkness.
దేవుడు ఎక్కడ వున్నడో, అక్కడ మరేమీలేదు
ఎక్కడ లోకం వున్నదో, అక్కడ దేవుడు లేడు
ఈ రెండు ఎప్పుడూ కలవవు, వెలుగు చీకట్ల లాగ

dEvuDu ekkaDa vunnaDO, akkaDa marEmIlEdu ekkaDa lOkam vunnadO, akkaDa dEvuDu lEDu I renDu eppuDU kalavavu, velugu chIkaTla laaga

# 2 Why are people so afraid? The answer is that they have made themselves helpless and dependent on others. We are so lazy, we do not want to do anything ourselves. We want a Personal God, a Savior or a Prophet to do everything for us.
ఎందుకు ప్రజలు అంతగా భయపడుతారు?
దీనికి సమాదానము - వాల్లు తమను నిస్సహాయకులుగ, ఇతరుల మీద ఆధార పడే లాగా చేసుకున్నారు. మనము చాలా బద్దకస్థులము, ఏ పని సొంతంగా చేయాలనుకోము. మనకు అన్నీ చేసిపెట్టదానికి ఓ దేవుడో, సమ్రక్షకుడో లేదా ఓ ప్రవక్తో కావాలి.

enduku prajalu antagaa bhayapaDutaaru?dIniki samaadaanamu - vaallu tamanu nissahaayakuluga, itarula mIda aadhaara paDE laagaa chEsukunnaaru. manamu chaalaa baddakasthulamu, E pani sontamgaa chEyaalanukOmu. manaku annI chEsipeTTadaaniki O dEvuDO, samrakShakuDO lEdaa O prawaktO kaavaali.

#3 There cannot be friendship without equality.
సమానత్వము లేకుంటే స్నేహము వుండదు

samaanatvamu lEkunTE snEhamu vunDadu

#4 Truth does not pay homage to any society, ancient or modern. Society has to pay homage to Truth or die.
సత్యము ఏ సమాజానికి జోహార్లు పట్టదు.
సమాజమే సత్యానికి జోహార్లు పట్టాలి, లేదా - అంతమవుతుంది

satyamu E samaajaaniki jOhaarlu paTTadu. samaajamE satyaaniki jOhaarlu paTTaali, lEdaa - antamavutundi

#5 Are you unselfish? That is the question. If you are, you will be perfect without reading a single religious book, without going into a single church or temple.
నీవు నిస్వార్దివా? ఇది ప్రశ్న? నిస్వార్దివైతే, నీవు ఏ మత పుస్తకము చదవకుండానే, గుడికి గాని, చర్చికి గాని, మసీదుకి గాని వెల్లకుండానే సంపూర్ణుడవు అవుతావు!

nIvu nisvaardivaa? idi praSna? nisvaardivaitE, nIvu E mata pustakamu cadavakunDaanE, guDiki gaani, carchiki gaani, maseeduki gaani vellakunDaanE sampoorNuDavu avutaavu!

--- మరిన్ని త్వరలో
అనువాదము: గౌరి శంకర్ సాంబటూర్ Sep 16, 2006

Saturday, September 09, 2006

వందేమాతరం - తాత్పర్యము

వందేమాతరం
వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం...1
శుభ్రజ్యోత్స్నం పులకిత యామినీమ్
పుల్లకు సుమిత ద్రుమదల శోభినీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం...2
కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం...3
తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం...4
త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, మాతరం వందేమాతరం...5
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం...6

వందేమాతరం తాత్పర్యము
------------------------------------
తల్లికి నమస్కరించుచున్నాను. మంచినీరు, మంచి పంటలు, మలయమారుతముల చల్లదనము గలిగి సస్యశ్యామలమైన (మా) తల్లికి నమస్కరించుచున్నాను.
తెల్లని వెన్నెలలతో పులకించిన రాత్రులు గలిగి, వికసించిన పూలు, చివురులుగల తరువులతో ప్రకాశించుచు దరహాసములతోనూ, మధుర భాషణములతోను, సుఖమును, వరములను ఇచ్చు (మా) తల్లికి నమస్కరించుచున్నాను.
కోటి కోటి కంఠముల కల కల నినాదములతో కరకు తేలిన తల్లి! కరకు కత్తులు ధరించిన అనేక కోట్ల భుజముల బలముగల మాతా! అబలలకు బలమైనదేవీ? వివిధ శక్తులు ధరించి శత్రువుల నివారించుచు (మమ్ము) తరింపజేయగల మా తల్లీ! నమస్కరించుచున్నాను.
నీవే విద్య, నీవే ధర్మము, నీవే హృదయము, నీవే మర్మము. శరీరములో ప్రాణము నీవే! తల్లి! మా శక్తివి, మా మనస్సులలోని భక్తివి నీవే! మా హృదయ మందిరములలో వెలసిన ప్రతిమవు నీవే! నీకు నమస్కరించుచున్నాను.
పది ఆయుధములు చేతబట్టిన దుర్గవు నీవే. పద్మదళములందు విహరించెడి లక్ష్మివి నీవే. విద్యా దాత్రియైన శారదవు నీవే. కమలా! అమలా! అతులా! సుజలా! సుఫలా! శ్యామలా! సరళా! సుస్మితా! అలంకృతా! (మమ్ము) భరించుమాతా! భూమాతా! నీకు నమస్కరించుచున్నాను.
సమర్పణ: భారత్ వికాస్ పరిషత్, చీరాల శాఖ

వింత కొబ్బరి చెట్టు

అబ్బురం కల్గించే ఈ వింత కొబ్బరి చెట్టు.

http://photos1.blogger.com/blogger/2185/2416/1600/rare%20coconut%20tree.jpg

Friday, September 08, 2006

ఎలా వుంది

పేరు : స్టాలిన్
జన్మస్థలం : తెనాలి
వృత్తి : క్రిమినల్
అడ్రస్స్ : 7/జి బృందావన్ కాలనీ
చేసిన హత్యలు : 143
మొదటిది : మద్యాహ్నం హత్య
నాన్న : ముఠామేస్త్రి
అమ్మ : రాములమ్మ
ఇంటిపేరు : బొమ్మరిల్లు
తమ్ముడు : గుడుంబా శంకర్
అన్నయ్య : హిట్లర్
పెళ్ళాం : ఆవిడా మా ఆవిడే
పిల్లలు : లిటిల్ సోల్జర్స్
పెద్ద కొడుకు : దొంగ రాముడు
రెండో కొడుకు : మోసగాళకు మోసగాడు
మూడో కొడుకు : పోకిరి
పెంపుడు కొడుకు : దత్తపుత్రుడు
కుటుంబ సభ్యులు : అందరూ దొంగలే
మాతో పెట్టుకుంటె : డేంజెర్
శత్రువులు : మన ఊరి పాండవులు
మిత్రులు : కే డి #1, రౌడీ ఇన్స్ పెక్టెర్, స్టేట్ రౌడి
ఫైనాన్సియర్: అప్పుల అప్పారావు

వయస్సు : ఆ ఒక్కటీ అడక్కు
నమ్మనిది : అదృష్తం
నచ్చనిది : పెళ్ళి
తియ్యాలనేది : ప్రాణం
నచ్చని వ్యక్తి : ఎస్.పి.పరశురాం
నచ్చిన వ్యక్తులు : ఆ నలుగురు
ఊతపదం : అమ్మ మీద ఒట్టు
జన్మరాశి : సింహారాశి
నచ్చిన పండుగ : సంక్రాంతి
ఎప్పుడూ కోరుకునేది : జయం
ఆదర్శం : భారతీయుడు
చివరకు మిగిలేది : దైయ్యాల కోట చూడాలని ఉంది
నచ్చిన సినిమా : చట్టానికి కళ్ళులేవు
నచ్చని సినిమా: ఖైదీ వేట

నా ఆయుధం: వజ్రాయుధం
నా గర్ల్ ఫ్రెండ్ పిలిచేది: చుక్కలో చంద్రుడు

వీడెవడండీ బాబూ : ఇడియట్
ఐతే ....
చివరికి మిగిలేది
జైలుపక్షి

------------------
శ్రీకారము : జ్యొతి వలబోజు at http://groups.google.com/group/telugublog

సామెతలు

గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్చ పొయిందట.
చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు.
ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికెగురుతానన్నదంట.
వినే వాడుంటె, అరవంలో హరికద చెప్పాడట నీలంటివాడు.
సుబ్బి పెళ్ళి వెంకి చావుకొచ్చింది.
ఆకులు నాకే వాడి మూతి నాకేవాడు.